అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా పనిచేయాలి
1 min read– మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : అధికారులు ప్రజలకు జవాబు దారి తనంగా పనిచేయాలని అలా కాకుండా ఇష్టానుసారం ఉండడం సబబు కాదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, మంగళవారం స్థానిక మండల సభా భవనంలో ఎంపీపీ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సర్వసభ్య సమావేశంలో ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించినవి ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు, వాటిని మళ్లీ సమావేశాని కల్లా ఏమాత్రం పూర్తి చేశారో అధికారులు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీపీ అన్నారు, సమస్యలు పరిష్కారం కానీ సమావేశాలు ఎందుకని ఆయన అధికారులను ప్రశ్నించారు, ఇలాగైతే ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకోవాలో మీరే చెప్పాలని అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు, జాతీయ రహదారి విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఇండ్లు ఇండ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించిన ఇంతవరకు వాటిని పట్టించుకున్న నాధుడే లేడన్నారు, అంతేకాకుండా అక్కడ సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ , బస్ షెల్టర్ ఇతరత్రా సమస్యలు చాలా ఉన్నాయని ఎన్ హెచ్ ఎ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారి సాయి మాట్లాడుతూ నేషనల్ హైవే కొత్త రోడ్డు పైన ఇరువైపులా పనులు చేపట్టేందుకు 12 కోట్ల 51 లక్షల రూపాయలు మంజూరు అయిందని, త్వరలోనే అక్కడ సర్వీస్ రోడ్డు, అదేవిధంగా డ్రైనేజీ, బస్ షెల్టర్ నిర్మించడం జరుగుతుందన్నారు, అలాగే రోడ్డుకు ఇరువైపులా నేషనల్ హైవే కి ఎంత అయితే స్థలం తీసుకున్నామో ఆ స్థలంలో వరకు హద్దులు ఏర్పాట్లు చేస్తామని, అక్కడ ఎవరైనా నిర్మాణాలు చేపడితే తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు, దీనికి స్పందించిన ఎంపీపీ త్వరగా తిన పనులు చేపట్టకపోతే నేషనల్ హైవే ఇబ్బందం చేస్తామని హెచ్చరించారు, అలాగే వేసవి నీ దృష్టిలో ఉంచుకొని మండల వ్యాప్తంగా ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని అధికారులను ఆదేశించారు, అలాగే ఏ ఏ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య ఉందో అక్కడి కార్యదర్శులు ఎంపీడీవో దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు, ఉప్పరపల్లి ,శివాల పల్లి గ్రామాలలో చేతి పంపు( బోరింగులు) రిపేరులో ఉన్నాయని వాటిని బాగు చేయాలని సర్పంచ్ ముమ్మడి సుదర్శన్, నిరంజన్ రెడ్డి ఎంపీడీవో దృష్టికి తీసుకురావడం జరిగింది, ఎంపీడీవో మాట్లాడుతూ చేతి పంపు కు సంబంధించిన సామాగ్రి అంతా ఎంపీడీవో ఆఫీస్ నందు ఉన్నాయని వాటిని తీసుకెళ్లి పని చేసుకోవాలని ఏవైనా ఖర్చులు ఉంటే పంచాయతీ జనరల్ ఫండ్ లో వాడుకోవాలని ఆయన తెలియజేశారు, మండపేటలో తాగునీటి బోరు కావాలని ఎంపీటీసీ నాగిరెడ్డి అడుగగా వెంటనే దానికి సంబంధించిన బోరు ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో హామీ ఇవ్వడం జరిగింది, ఓబులంపల్లి, నజీర్ బేగ్ పల్లి, రామనపల్లి, దౌలాతాపురం రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఓబులంపల్లె సర్పంచ్ చల్లా వెంకటసుబ్బారెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది, దీనిపై స్పందించిన పంచాయతీరాజ్ ఏ ఈ మురళి మాట్లాడుతూ, ఓబులంపల్లి, రామనపల్లి, నజీర్ బేగ్ పల్లి గ్రామాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ వర్క్స్ శాంక్షన్ అయ్యాయని దీనికి సంబంధించి టెండర్లు పిలవడం జరిగిందని ఆయన తెలియజేశారు, అధికారులు ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే ప్రజా ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీ లను సంప్రదించి ఆ పనులకు సంబంధించిన విషయాలను తెలియజేయాలని ఎంపీపీ అధికారులకు తెలియజేశారు, అనంతరం నేడు జరిగిన ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు ఏవైతే సభ దృష్టికి తీసుకువచ్చారో వాటిని మళ్లీ సమావేశానికి పూర్తిచేసే విధంగా అధికారులు చొరవ చూపాలని తీర్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, డిప్యూటీ తాసిల్దార్, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.