ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలి
1 min read
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్ధాయి పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తోపాటు జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్వో వి. విశ్వేశ్వరరావు,ఆర్డివో అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్ లతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యతగల ఎండార్స్ మెంట్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా శాఖాధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలుతీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అందరూ మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల్లో పి-4 సర్వే, ఎంఎస్ఎంవి సర్వే పురోగతిని కూడా పర్యవేక్షించాలన్నారు. మూడవ శనివారం ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛ-ఆంధ్ర , స్వచ్ఛ-దివాస్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. అందిన అర్జీలలో కొన్ని జంగారెడ్డిగూడెం మండల గురువాయిగూడం కు చెందిన వామిశెట్టి రమేష్ తమ భూమిని నిషేధితజాబితా నుండి తొలగించి క్రమబద్దీకరించాలని కోరారు. ముసునూరు మండలం గోపవరం కు చెందిన కొయ్యూరి తిరుపతమ్మ అర్జీనిస్తూ తమ భూమిని ఆన్ లైన్ చేసి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు. ఏలూరు లంకపేటకు చెందిన అముజూరి సింహాచలం అర్జీనిస్తూ తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం ఘంటావారిగూడెం కు చెందిన కలపాల కృష్ణమూర్తి అర్జీనిస్తూ తమ తండ్రి ఇచ్చిన భూమిని తమ అన్నదమ్ముల ముగ్గురికి సమానంగా ఆన్ లైన్ చేయించి తహశీల్దారు వారి ద్వారా పట్టాఇప్పించాలని కోరారు. లింగపాలెంకు చెందిన తగరం అన్నపూర్ణమ్మ అర్జీనిస్తూ తమ వ్యవసాయ బోరు బావి పూర్తిగా పోయి ఉపయోగం లేనందున ఎస్సీ కార్పోరేషన్ ద్వారా బోరుబావి మంజూరు చేయాలని కోరారు. లింగపాలెం కు చెందిన తగరం దాసు అర్జీనిస్తూ తాము నివశిస్తున్న నివేశన స్ధలంకు సంబంధించి రెవిన్యూ రికార్డులో ఆన్ లైన్లో నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.