NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యల పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలి: కలెక్టర్

1 min read

పల్లెవెలుగు, వెబ్ వెలుగోడు : అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామున్ పేర్కొన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్పందన దరఖాస్తుల పురోగతి గురించి తహశీల్దార్ మహమ్మద్ రఫీ ని అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత సచివాలయం 2,3 కార్యాలయాలను సందర్శించడం జరిగింది. సిబ్బంది తో హోసింగ్ , నాడు -నేడు పనుల పురోగతి గురించి అడిగారు. హోసింగ్ ఏ.ఇ శ్రీనివాసులు జగనన్న కాలనిలో 870 గృహాలకు 376 బిఎల్ స్థాయికి వచ్చాయని , 26 ఇల్లు స్లాబ్ స్థాయికి వచ్చాయని తెలిపారు. 2వ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి ఈ క్రాప్ , ఈ కేవైసి పై శిక్షించాలని అన్నారు. ఉర్దూ బాలికల పాఠశాల నందు నాడు – నేడు పనుల పురోగతిని పరిశీలించారు.. ఈ సందర్భంగా ప్రజలు భూమి , రేషన్ కార్డ్ , సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గిరిజనులు ఇతర కులాలను ఎస్టీ లో చేర్చడాన్ని జీవో నెంబర్ 52ను రద్దు చేయాలని , ఏకసభ్య కమిషన్ను కూడా రద్దు చేయాలని అలాగే ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని వెలుగోడు మండల వైస్ ఎంపీపీ కొడావత్ శంకర్ నాయక్ వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయంలో పై అధికారులకు నివేదిక పంపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు . అలాగే వెలుగోడు జమ్మి నగర్ తాండలోని స్మశాన వాటిక 40 ఏళ్ల నాటి నుండీ వాడుకలో ఉన్నా దానికి సంబంధించిన పట్టా ఇవ్వడంలేదని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది ఈ విషయంలో ఆర్డీవో గారితో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

About Author