PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్ కు కోపం తెప్పించిన అధికారులు..

1 min read

-ఇక్కడ ఎక్కువగా సమస్యలు ఉన్నాయ్ -గ్రామాల్లో ఉద్యోగులు ఉన్నా సమస్యలు పరిష్కరించకపోతే ఎలా..? -గ్రామాల్లో చెత్తా చెదారం ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం -రెవెన్యూ అధికారులపై సీరియస్ -మిడుతూరులో అధికారులను సెట్ రైట్ చేయాలన్నా కలెక్టర్

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని వెలుగు మహిళా మండలి పొదుపు కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 11:25 నుండి 2:30 వరకు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూ న్ వినతులను స్వీకరించారు. వచ్చిన విన్నతులను ఎప్పటికప్పుడు అధికారులను పిలుస్తూ సమస్యలను పరిష్కరించాలని వారికి ఆదేశాలు ఇచ్చారు.వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం అయ్యారు. స్పందనలో జిల్లా కలెక్టర్ కు అధికారులు కోపం తెప్పించారు.ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగిన స్పందనలో 117 అర్జీలు ప్రజల నుండి వచ్చాయని కలెక్టర్ అన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎంపీడీవో తహసిల్దారు ఈఓఆర్డి ఉన్నారు వీరితోపాటు ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి,విఆర్ఓ,సచివాలయ సిబ్బంది అంత మంది పనిచేస్తున్నారు.ప్రతిరోజూ గ్రామాల్లో స్పందన జరుగుతూ ఉంది.అయినా నాకు ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చాయి.ఎందుకు మీరు గ్రామాల్లో సమస్యలను పరిష్కరించలేకపోతున్నారా అంటూ అధికారులను ప్రశ్నించారు.ముందుగా వీఆర్వోలుమరియు సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారని వారిని అడిగారు.రైతులకు మీరు నోటీసులు ఇవ్వడం లేదు ప్రతి వీఆర్వో దీనిని సీరియస్ గా తీసుకుని గుర్తుపెట్టుకోవాలని ప్రజల సమస్యల మీద సరైన సమాధానం లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యలను పెండింగ్ లో పెట్టడం అదేపనిగా తిప్పుకోవడం మీకు మంచి పద్ధతి కాదు.రెవెన్యూ సిబ్బంది ఏవిధంగా పని చేస్తున్నారని తహసిల్దార్ కార్యాలయంలో ఏమేమి ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని ఆర్డిఓ దాసును కలెక్టర్ హెచ్చరించారు.ఇక్కడ మండల అధికారులు ఎంపీడీవో, తహసీల్దార్,ఈఓఆర్డి మీరు సరిగ్గా పనిచేయడం లేదని స్పందన ద్వారా స్పష్టంగా అర్థం అవుతుందని సరిగ్గా పని జరగడంలేదని ఇక్కడ ఓవరాల్ గా ఫీడ్ బ్యాక్ ఉందని మీరు కింది స్థాయి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మీరు చూసుకోవాలని అన్నారు.తర్వాత గతంలో నేను ఎక్కడికి వచ్చినప్పుడు గ్రామాల్లోని చెత్తా చెదారం ఊరి బయటే చెత్తాచెదారం గ్రామాల్లో అపరిశుభ్రంగా ఉందని ఈరోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చూస్తే గ్రామాలు ఎందుకు అపరిశుభ్రంగా ఉన్నాయని ఈఓఆర్డి ఫక్రుద్దీన్ ను కలెక్టర్ ప్రశ్నించారు. మిడుతూరులో టీంను సరి చేయాల్సిన అవసరం ఉందని ఎంపీడీవో,తహసిల్దార్,ఈవో ఆర్డి తో అన్నారు.ఇక్కడ మిడుతూరు బస్టాండ్ లో గతంలో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంలో ఉన్నందున మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు రావడంతో ఎందుకు అలా చేస్తున్నారంటూ కలెక్టర్ ఈఓ ఆర్డి పై సీరియస్ అయ్యారు. ఇలాగైతే కుదరదు మండల అధికారులు విధుల పట్ల చాలా సీరియస్ గా ఉండాలని ఇలాగైతే కష్టమని సస్పెండ్ చేసే దాకా తెచ్చుకోవద్దు అంటూ కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.మండలంలో ఉపాధి హామీ పథకం 6వేల జాబ్ కార్డులు ఉండగా వీరిలో 29 మందికి మాత్రమే సంవత్సరానికి వంద రోజుల పని కల్పించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడుతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్త్రీల వ్యాధి డాక్టర్ ను వెంటనే నియమించాలని అన్నారు.ప్రతి శాఖనూ కూడా వదలకుండా అధికారులపై జిల్లా కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా అధికారులు సమాధానం చెప్పలేక ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు. మండలంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయని ఎంఈఓ ను అడగ వారు సమాధానం చెప్పలేక పోయారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య,హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు మండల అధికారులు పాల్గొన్నారు.

About Author