గరిష్ఠాల వద్ద చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. “బ్యారెల్ చమరు ధర $100 కంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది” అని ఆయిల్ బ్రోకర్ పీవిఎంకు చెందిన తమస్ వర్గా అన్నారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3.48 డాలర్లు పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. గతంలో ఇంతకు ముందు ఈ ధర 99.38 డాలర్లకు చేరుకుంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు మరింత భారం కానుంది.