మీరు చేస్తే ఒప్పు.. నేను చేస్తే తప్పా? : పవన్ కళ్యాణ్
1 min readహైదరాబాద్: ‘ మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటే లేని తప్పు.. నేను సినిమాలు తీస్తే ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు` పవన్ కళ్యాణ్. అవినీతి చేయకూడదనే సినిమాలు తీస్తున్నానని అన్నారు. సినిమా ద్వార తనతో పాటు వందల కుటుంబాలు బతుకుతాయని ఆయన తెలిపారు. తనకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు సినిమాలు తీస్తానని అన్నారు. మూడేళ్లుగా సినిమా చేయలేదన్న బాధ కలగలేదని, ఏపని చేసిన దేశం కోసం, జనంకోసం చేశానని అన్నారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభిమానులు లేకపోతే , తాను లేనని అన్నారు. తాను మనస్పూర్తిగా ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. ఏ మాత్రం ఆదరణలేని సమూహం నుంచి వచ్చిన వాడినని చెప్పారు. అభిమానుల గుండెల్లో ప్రేమ గౌరవించేవాడని.. అభిమానుల గుండె చప్పుడు అర్థం చేసుకున్న వాడిని.. సినిమా ద్వార అభిమానులకు ఆనందాన్నివ్వాలని పరితపించేవాడని అన్నారు. దిల్ రాజు లాంటి నిర్మాతతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ స్వశక్తితో పైకొచ్చిన వ్యక్తి అని అన్నారు.