మనిషి జీవితంలో వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదు..
1 min read– ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించడం అలవాటు చేసుకోవాలి….
– ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : మనిషి జీవితంలో ఎవరికి వృద్ధాప్యం శాపంగా మారకూడదని, ప్రతి ఒక్కరు వృద్ధులను గౌరవించడం అలవాటు చేసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలీ క్లినిక్ లో అక్టోబర్ ఒకటవ తేదీ జరగనున్న ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిరుపేద వృద్ధ మహిళలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆయన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి అక్టోబర్ ఒకటవ తేదీని ప్రపంచ వృద్ధుల దినోత్సవం గా ప్రకటించిందని వివరించారు. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం,కౌమార్యం, వృద్ధాప్యమని నాలుగు దశలు ఉంటాయని, అయితే వృద్ధాప్యం దశ మాత్రం కొందరికి శాపంగా మారుతుందని చెప్పారు. వృద్ధాప్యంలో వృద్ధులకు మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ,బి.పి షుగర్, కీళ్ల నొప్పులు, న్యూరోలాజికల్ లాంటి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనలో ఉన్న వృద్ధులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వృద్ధులకు చాలా గౌరవం ఉండేదని, ప్రస్తుతం ఉమ్మడి కుమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో వృద్ధులు వృద్ధాప్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. వృద్ధాప్యంలో నిరాదరణకు గురైన వారిని చేరదీసి ఆదరించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, అందులో ఉన్నప్పటికీ కుటుంబంలో కలిసి ఉన్నంత ఆనందం వారికి ఉండదని చెప్పారు. చాలామంది వృద్ధులు తమ సంపాదన మొత్తాన్ని తమ పిల్లల పేర రాసి ఇచ్చి తమ వద్ద ఏమీ లేక వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. వృద్ధాప్యంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరు తమ వద్ద ఆర్థిక వనరులు ఉండేలా చూసుకోవాలని సూచించారు .అక్టోబర్ ఒకటో తేదీ ప్రపంచ వృద్ధాప్య వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నిరుపేద బుద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నానని తెలిపారు. నిరుపేద వృద్ధులకు సహాయం చేసేందుకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ శంకర శర్మ స్పష్టం చేశారు.