మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కర్నూల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్ష్ లో ఉన్న నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కేకును కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు మారుతి శర్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాట్లాడుతూ టిజి భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాతే మహిళలకు పురుషులతో పాటు రిజర్వేషన్లు ,హక్కులను కల్పించడం జరిగిందని అన్నారు .మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల తోపాటు ఆస్తిలో హక్కు తదితర అంశాల్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మహిళలకు ఉన్న సహనం మరెవరికీ ఉండదని, ఇంట్లో, ఇంటి బయట వారు కష్టపడే తీరు అభినందనీయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవ భావంతో మెలగాలని అన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో హయాంలోనే మహిళలకు సాధికారత సాధ్యమైందని చెప్పారు. దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యోగులకు పొదుపు గ్రూపు ఏర్పాటు చేసిన తర్వాతే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించారని చెప్పారు.