ఒమిక్రాన్ బీఏ2.. అసలు కంటే కొసరు ప్రమాదం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ కంటే దాని ఉప వేరియంట్ ప్రమాదకరమని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒమిక్రాన్ వేరియంట్ బీఏ1.. దాని ఉప వేరియంట్ బీఏ2ల వ్యాప్తి తీరు ఎలా ఉందన్న విషయం పై స్టాటెన్స్ సీరం ఇన్స్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్ కోపెన్ హేగన్, టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకలు పరిశోధన చేశారు. ఒమిక్రాన్ అసలు వేరియంట్ వ్యాప్తి రేటు 29 శాతం కాగా.. బీఏ2 వ్యాప్తి రేటు ఏకంగా 39 శాతంగా నమోదైంది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడ ఉపవేరియంట్ సోకుతుంది. వ్యాక్సిన్ తీసుకోని వారికి ఈ ముప్పుతో పాటు, ఇన్ ఫెక్షన్ తీవ్రత కూడ ఎక్కువగానే ఉంటోందని శాస్త్రవేత్తలు వివరించారు.