ఒమిక్రాన్.. లక్షణాలు స్వల్పమే : దక్షిణాఫ్రికా డాక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వారిని ఇంటి వద్ద ఉంచే చికిత్స అందిస్తున్నామని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ పేర్కొన్నారు. ఆమె ఓ ఇంగ్లీష్ వార్త సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. కోయెట్జీ దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ కమిటీలో కూడ సభ్యురాలు. ఇప్పటి వరకు తమ ఆస్పత్రికి వచ్చిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, వారిని ఇంటి వద్ద ఉంచే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వాసన, రుచిపోవడం, ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం వంటి సమస్యలు రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు ఈ వైరస్ వేరియంట్ ను పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశం పై పరిశోధన జరుగుతోందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. రోగ లక్షణాల తీవ్రత పై కూడ పరిశోధన జరుగుతోందని తెలిపారు.