ఒమిక్రాన్ కలవరం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేనా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ రూపంలో కరోన వైరస్ దూసుకొస్తున్న తరుణంలో ఐదు రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో ఈనెల 27న కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో ఈసీ సమావేశం నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఒమైక్రాన్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులపై ఆరోగ్య శాఖ అభిప్రాయాలను తీసుకోనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీల పదవీకాలం త్వరలో ముగియనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం కీలకంగా మారనుంది. కాగా, ఉత్తర ప్రదేశ్‌లో వచ్చేవారం తాను పర్యటించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర శుక్రవారం వెల్లడించారు.