NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒమిక్రాన్ తొలి మరణం.. ధృవీకరించిన ప్రధాని

1 min read

పల్లెవెలుగు వెబ్​: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తొలి మరణం బ్రిటన్ లో నమోదైంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధృవీకరించారు. ప్రతి రెండు మూడు రోజులకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బ్రిటన్ లో రెట్టింపవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 1239 ఒమిక్రాన్ కేసులు నమోదవడం.. వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే యూకేలో 3100 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ యూకేలో కార్చిచ్చులా వ్యాప్తి చెందుతుండటంతో బూస్టర్ డోసు కార్యక్రమాన్నిచేపట్టారు.

About Author