NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒమిక్రాన్ క‌ల‌వ‌రం.. 10 మంది ద‌క్షిణాఫ్రిక‌న్లు మిస్సింగ్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమ‌త్తమ‌య్యాయి. ద‌క్షిణాఫ్రికాతో పాటు విదేశాల నుంచి వ‌స్తోన్న ప్రయాణీకుల‌పై దృష్టిపెట్టాయి. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో రెండు కేసులు న‌మోద‌వ్వడంతో దేశ‌వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అల‌ర్ట్ ప్రక‌టించింది. అయితే.. ద‌క్షిణాఫ్రికా నుంచి బెంగ‌ళూరు వ‌చ్చిన 10 మంది పత్తాలేకుండా పోయిన‌ట్టు బృహ‌న్ బెంగళూరు మ‌హాన‌గ‌ర పాలికే చేసిన ప్రక‌ట‌న క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. అధికారులు వీరి జాడ తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ ప్రయాణీకుల కోసం గాలిస్తున్నామ‌ని, కొంద‌రు ఫోన్ కాల్స్ కు స్పందించ‌డం లేద‌ని అన్నారు. ప్ర‌జ‌లు జాగ్రత్తగా ఉంటూ భ‌ద్రతాప్రమాణాలు పాటించాల‌ని బీబీఎంపీ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ గుప్తా కోరారు.

About Author