‘ఓమిని’సేవలు.. అభినందనీయం
1 min read– ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప
– పోలీసు కుటుంబాల మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు
పల్లెవెలుగు, కర్నూలు;
పోలీసు కుటుంబాల మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ‘ ఓమినీ’ హాస్పిటల్ యాజమాన్యం
ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ఉత్తర్వుల మేరకు జిల్లా మహిళా పోలీసు సిబ్బందికి , పోలీసు కుటుంబాల మహిళలకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని కర్నూలు ఆర్ముడు రిజర్వుడు అదనపు ఎస్పీ ఎమ్. కె. రాధాక్రిష్ణ ప్రారంభించారు. బి.పి, షుగర్ టెస్ట్, ఈ సిజి, ప్యాప్సి మియర్(PAP SMEAR) , ఫిజిషియన్, కార్డియాలజిస్టు, యూరాలజిస్టు, గైనకాలజిస్టు, ఆర్ధో పెడిక్, జనరల్ సంబంధిత వంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. వాటికి సంబందించిన సలహాలు , సూచనలను డాక్టర్లు తెలియజేసి, మెడిసిన్ అందజేశారు. కార్యక్రమంలో టాస్క్ ఫోర్సు డిఎస్పీ రాజీవ్ కుమార్, పోలీసు వేల్పేర్ యూనిట్ హస్పిటల్ డాక్టర్ ఆర్. స్రవంతి , ఒమిని హాస్పిటల్ డాక్టర్లు జి. గోవిందారెడ్డి, పి.అమల, శ్వేత బరద్వాజ్, వి. శ్వేత రెడ్డి, కె. విజయలక్ష్మీ, ఓ. రామ్ పక్కీర, కె. బాస్కర్, శ్రీహరి రెడ్డి, ఎస్. గౌస్ అహమ్మద్, ఆర్. విజయభాస్కర్, ఆర్ఐవియస్. రమణ తదితరులు పాల్గొన్నారు.