14న 11కె.వి పెన్నవల్లి వారి పేట ఫీడర్ చెట్లు తొలగింపు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10-10.jpg?fit=550%2C759&ssl=1)
ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల
అగ్రహారం,కెనాల్ రోడ్డు, సత్యనారాయణపేట, వివిధ ప్రాంతాలలో విద్యుత్ కు అంతరాయం
వినియోగదారులు సహకరించాలి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కె.యం.అంబేద్కర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఈనెల 14వ తేది శుక్రవారం ఏలూరు 1వ పట్టణం లో గల కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిదిలో 11కెవి వెన్నవల్లి వారి పేట ఫీడరు చెట్ల తొలగింపు నిమిత్తం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ తెలిపారు.ఈ సమయంలో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధిలో గల అగ్రహారం, కెనాల్ రోడ్, సత్యనారాయణపేట, లంబాడిపేట, వెన్నవల్లివారిపేట, నవాబ్ పేట, బాలాజీ థియేటర్, జంట కళ్యాణ మండపాలు మరియు రామకోటి పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.కావున వినియోగదారులు సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.