22న శ్రీ శ్యామల మాతాంగి దేవి నూతన విగ్రహ ప్రతిష్ట
1 min readవిగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్న పుష్పగిరి పీఠాధిపతి. విద్యా శంకరా భారతి స్వామి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం గోపవరం గ్రామం వద్ద కడప పుష్పగిరి రోడ్డు ప్రక్కన ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ శ్యామల మాతాంంగిదేవి ఆలయాన్ని నిర్మించేందుకు చెన్నూరు. బుడ్డాయిపల్లి. గోపవరం. శివాలపల్లి గ్రామాల పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు గత రెండు నెలలుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఈనెల 22వ తేదీ గురువారం ఉదయం 10- 39 నిమిషాలకు పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ అభిన ఉద్దండ విద్యా శంకర భారతి స్వామి చేతులు మీదుగా శ్రీ శ్యామల మాతాంగి దేవి యంత్ర. విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్పగిరి క్షేత్రం. కాశీ విశ్వనాథ ఆలయం వెళ్లే రహదారి ప్రక్కన శ్రీ శ్యామల మాతంగి దేవి ఆలయం నిర్మించడంతో భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. కడప కర్నూల్ ఉప్పరపల్లి రోడ్డు నుంచి పుష్పగిరి వరకు రెండు నెలల కిందట డబల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీని కారణంగా పర్యాటకుల సంఖ్య పెరగనున్నది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నుంచి జాతీయస్థాయిలో వృషభ రాజులచే బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు.