PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిబ్రవరి ..29న “వికలాంగుల సింహ గర్జన

1 min read

వికలాంగుల సంక్షేమ పథకాలను నెరవేర్చలేని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం.! 

–  డిఎస్పీఎఫ్ జెఏసి జిల్లా అధ్యక్షులు బిసి నాగరాజు, 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  దివ్యాంగుల సంక్షేమ పథకాలను నెరవేర్చని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని డీఎస్పీఎఫ్ జేఏసీ  జిల్లా అధ్యక్షులు  బిసి నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏవి ప్రకాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి. ప్రాంగణంలో జిల్లా “వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ” (జేఏసీ) ప్రధాన కార్యదర్శి ఏ వి ప్రకాష్ ఆధ్యక్షతన  వికలాంగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  జిల్లా జేఏసీ గౌరవాధ్యక్షులు బి ఎల్లప్ప,  డిఎస్పీఎఫ్ అధ్యక్షులు బి సి నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏ వి ప్రకాష్, కోశాధికారి కె. ఈరన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  రాష్ట్ర  ప్రభుత్వం వికలాంగుల సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను, హక్కులను, చట్టాలను, రాయితీలను, రిజర్వేషన్లను దూరం చేసిందన్నారు. ఈ  క్రమంలో వికలాంగుల అందరి సమైక్యంతో ఫిబ్రవరి-29న తేదీన “వికలాంగుల సింహ గర్జన” కార్యక్రమాన్ని నిర్వహిస్తుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల, గ్రామాల్లో ఉన్న వికలాంగులందరితో “వికలాంగుల సభ” ను నిర్వహిస్తామని వివరించారు.  రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల గురించి సమీక్షించడం జరిగిందాన్నారు.  ఈ కార్యక్రమాలకు పత్తికొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని, గ్రామాల్లోని వికలాంగుల అందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ బహిరంగ సభలను జయప్రదం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు  మద్దిలేటి, జేఏసీ సహాయ కార్యదర్శి సురేష్ నాయుడు, పాండు, క్రిష్ణయ్య, కేషన్న పత్తికొండ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లోని వికలాంగుల సంక్షేమ సంఘాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author