PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మత్తు పానియాలపై .. నవంబరు 1 నుంచి కళాజాత

1 min read

–ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన కర్నూల్ లోని టిజివి కల్యాణ మండపంలో మత్తు పానీయాల పై కళాజాత ప్రారంభమౌతుందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.కర్నూలు నగరంలోని హరిత హోటల్​లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతోపాటు నగర మేయర్ బి.వై రామయ్య, మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి,ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేశ్వరరావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ డా”భరత్ నాయక్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.సుబ్బయ్య, హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్, రంగం ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్ కరుణాకర్,రాజేష్, టూరిజం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ యువత, విద్యార్థులను మత్తుపానీయాల పై జాగృతలను చేయటానికి కళాజాత తోడ్పడుతుందని, నవంబర్ 1 నుండి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల లో డిగ్రీ,ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటి ప్రాంగణాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
గంజాయి పంటను ధ్వంసం చేస్తాం..


ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు లోని గంజాయి పంట సాగు చేస్తున్న 4500 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేస్తామని స్థానిక ప్రజలు తోడ్పాటును అందించాలని కోరారు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి . భారతదేశంలో డ్రగ్స్ వినియోగం లో ఉత్తర ప్రదేశ్,పంజాబ్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ 18 వ స్థానం లో ఉందన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి,డ్రగ్స్,అక్రమ మద్యం,నాటుసారా,గుట్కా ల పై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. అనంతరం మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి మద్య విమోచన ప్రచార కమిటీ ని ఏర్పాటు చేసి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ని చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రజలను జాగృతల ను చేయడం ద్వారానే మద్య నియంత్రణ సాధ్యమౌతుందన్నారు.ఈ మీడియా సమావేశంలో రాజేష్ బృందం కళారూపాలను ప్రదర్శించి ఆలపించారు.

About Author