NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానందిలో… మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు ,మహానంది:  మహానంది క్షేత్రంలో సోమవారం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ధ్వజానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల వేదమంత్రో చరణులు మంగళ వాయిద్యాల మధ్య ధ్వజారోహణం చేయడంతో పాటు ఈ కార్యక్రమం చేయడం వల్ల సకల దేవతలను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికినట్లు అవుతుందని వేద పండితులు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూర వాహనంపై ఆశీనులు గావించి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈఓ మధు, సూపరిండెంట్ శశిధర్ రెడ్డి వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారాం బట్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *