PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16న జిల్లా వ్యాప్తంగా  ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  రవాణా రంగాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ,దోపిడీ విధానాల నుండి పోరాటాల ద్వారా కాపాడుకుందామని, డ్రైవర్లను జైళ్లకు పంపే హిట్ అండ్ రన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా జరిగే ఆటోల బంద్ ని జయప్రదం చేయాలని, ప్రజలంతా సహకరించాలని సిఐటియు పాణ్యం మండల కార్యదర్శి పిలుపునిచ్చారు  వాహన యజమానులకు,డ్రైవర్లకు పిలుపునిచ్చారు.ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండల కేంద్రం ఆటో స్టాండ్ నందు  ప్రచారం నిర్వహించడం జరిగింది..ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్   మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ,దోపిడీ విధానాల వల్ల రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. పెట్రోల్,డీజిల్, ఇన్సూరెన్స్ ప్రీమియం,వాహన స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడం,రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 ద్వారా అన్ని రకాల ఫీజులు,పెనాల్టీలు 10% నుండి 100% వరకు పెంచడంతో వాహన యజమానులు ప్రతినెల డబ్బులు కూడా చెల్లించలేక అప్పుల పాలు అయ్యే పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరో ప్రక్క కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నదని దేశంలో 30 శాతానికి పైగా డ్రైవర్ల కొరత ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నదన్నారు.మరో ప్రక్క  రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ ప్రమాదానికి కారణమైన డ్రైవర్లకు పదేళ్ల జైలు శిక్ష,10 లక్షల జరిమానా లాంటి ప్రభుత్వ లోప భూయిష్ట విధానాలతో డ్రైవర్లు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారనీ  చట్టాలు అమలు అయితే డ్రైవర్లు వాహనాలలో కాకుండా జైళ్లలో మగ్గే పరిస్థితులు దాపురిస్తాయని వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. .ఈ కార్యక్రమంలో ,ఆటో యూనియన్ నాయకులు తిరుమలేశు సుబ్బరాయుడు నాగరాజు మహబూబ్ బాషా తదితరులు  పాల్గోన్నారు.

About Author