17న చెరుకూరి రాజమ్మ సంతాప సభ
1 min readపల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఈ నెల 17వ తేదీ గురువారం కీ. శే. చెరుకూరి రాజమ్మ సంతాప సభను జిల్లా కేంద్రం కర్నూలు లో నిర్వహిస్తున్నట్లు చెరుకూరి అశోక రత్నం తెలియజేశారు. గురువారం నందికొట్కూరు లోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రేస్ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి చెరుకూరి అశోకరత్నం సతీమణి రిటైర్డ్ తహశీల్దార్ చెరుకూరి రాజమ్మ నవంబరు 02న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం కర్నూలు లోని వార్త ఆఫీసు ప్రక్కన నందికొట్కూరు రోడ్డు లోని కె.వి.ఆర్ గార్డెన్ నందు సంతాప సభను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు.