NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

18న మండల స్థాయిలో… ‘వైఎస్సార్​ ’ క్రీడా ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు:  కడప జిల్లా చెన్నూరు 2022- 23 సంవత్సరమునకు గాను డాక్టర్ వైఎస్ఆర్  క్రీడా పాఠశాల కడప కడప ఎంపికలను 4వ తరగతి లో ప్రవేశాల  కోసం- ఆంధ్ర ప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ- విజయవాడ నుండి ఎంపిక తేదీలను నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి లీల్లెమ్మ ఆదివారం విలేఖర్లకు తెలిపారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల లో 4వ తరగతి గాను ఈనెల 18వ తేదీన మండల స్థాయిలో కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉదయం ఎనిమిది గంటలకు క్రీడా పోటీలు నిర్వహించే పడతాయని ఆమె తెలియజేశారు, ఈ పోటీలలో అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ఆసక్తిగల విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు, మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈనెల 20, 21 వ, తేదీలలో పాల్గొనవలసి ఉంటుందని ఆమె తెలిపారు,, ఈ ఎంపికలకు సంబంధించి అర్హతలు ఈ విధంగా కలిగి ఉండాలని ఆమె అన్నారు, 2021- 22 సంవత్సరానికి విద్యార్థి నీ విద్యార్థులు మూడవ తరగతి పూర్తి చేసి ఉండాలి, అలాగే వయసు 8, లేదా తొమ్మిది సంవత్సరాలు లోపు ఉండాలి అనగా 01-08-2013 నుండి31-07-2014 మధ్య జన్మించి ఉండాలి, ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికెట్, కలిగి ఉండాలి, అలాగే కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ ఆదాయ ధ్రువీకరణ పత్రం, 6 ఫోటోల తో, అభ్యర్థి యొక్క అన్ని సర్టిఫికెట్లను మూడు సెట్లు తీసుకొని ఎంపిక సమయంలో అందజేయవలసి ఉంటుందని ఆమె తెలియజేశారు.

About Author