NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాగుచ‌ట్టాల ర‌ద్దు పై.. కంగ‌న మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగుచ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ న‌రేంద్ర మోదీ నిర్ణ‌యం తీసుకున్నారు. దీని పై త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో ఉండే న‌టి కంగ‌న ర‌నౌత్ .. మ‌రోసారి త‌నదైన కాంట్ర‌వ‌ర్సీ కామెంట్స్ చేశారు. పోరాటాల శక్తి నిరూపించిన ఫలితమిది అంటూ నెటిజన్‌ పోస్టు ను షేర్‌ చేసిన కంగనా .. ఇది చాలా విచారకరం, అవమానం.. పూర్తిగా అన్యాయం“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు పార్లమెంటులో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధి పోరాటం చేస్తున్న వ్యక్తులు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే, ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ  సెటైర్స్‌ వేసింది. కంగ‌న వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. రైతుల‌కు మ‌ద్దుతుగా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంటే సంతోషించాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల ఆమె పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

About Author