PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌ర్త్ డే సంద‌ర్భంగా.. ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్‌స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(అప్పు) గతంలో చేసిన సేవలను ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ముందుకు కొనసాగించబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘నాకు ప్రత్యేకమైన రోజున ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించిన సేవలను ఇకపై నేను ముందుకు తీసుకెళ్లబోతున్నా. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాను’’ అని అప్పూ ఫొటోను షేర్‌ చేశారు.

                                                  

About Author