మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గౌరీ శంకర స్వామి కి విశేష రుద్రాభిషేకాలు అర్చనలు
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రాతఃకాలం నుండి విశేష పంచామృత అభిషేకాలు విశేష రుద్రాభిషేకాలు అర్చనలు జరిగినవి. మరియూ నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూల మంత్ర సహిత, మృత్యుంజయ, కాలభైరవ, రుద్ర హోమముసహిత,రాజశ్యామల హోమము విశేషంగా జరిగినవి. అధిక సంఖ్యలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.