NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ తిరుణాల సందర్భంగా.. హోమ్ టీం కబడి పోటీలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ తిరుణాల సందర్భంగా హోమ్ టీం కబడి పోటీలు  పత్తికొండలోనిశ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 75వ రథోత్సవం సందర్భంగా పత్తికొండ నియోజకవర్గం హోమ్ టీం  కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని స్థానిక చింతకాయల వీధిలోని,  అంజయ్య నగర్ మధ్య విశాల స్థలంలో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ కరణం నరేష్ మాట్లాడుతూ, ఆసక్తిగల కబడ్డీ క్రీడాకారులు తమ తమ టీంలా   పేర్లను 28/2/2024 ఉదయం 10 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కబడ్డీ టోర్నమెంటులో ఓక టీంలో ఆడిన క్రీడాకారులు  మరియొక టీంలో ఆడుటకు అనుమతి లేదని, అలా ఆడినచో టీంను పోటీల నుండి తొలగించడం జరుగుతుందని తెలిపారు.  ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఆర్గనైజర్స్ తెలిపారు. వివరాల కోసం గోవర్ధన్ నాయుడు, గంగాధర్, రవితేజ, ఈరన్న, మధు, ఆర్గనైజర్స్ నెంబర్స్  గంగాధర్ ఫోన్. 6303308617ను సంప్రదించాలన్నారు.

About Author