NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండో రోజు సీఎం ఢిల్లీ ప‌ర్యట‌న‌

1 min read

పల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ ప‌ర్యట‌న‌లో భాగంగా ప‌లువురు మంత్రుల‌తో భేటీ అయ్యారు. ఈరోజు ప్రజాపంపిణీ, ఆహారం శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో స‌మావేశ‌మ‌య్యారు. మ‌రో రెండు నెల‌లు బియ్యం ఉచితంగా పంపిణీకి కేంద్రం గ‌డువు పొడిగించ‌డంతో కేంద్ర మంత్రికి జ‌గ‌న్ కృత‌జ్ఞత‌లు తెలిపారు. కోవిడ్ నియంత్రణ‌లో భాగంగా ఏపీలో అన్ని ర‌కాల చ‌ర్యలు తీసుకున్నట్టు జ‌గ‌న్ తెలిపారు. ప్రస్తుతం ఏపీ కేటాయిస్తున్న రేష‌న్ బియ్యం విభ‌జ‌న ముందు ఉన్న కేటాయిస్తున్నవ‌ని, తెలంగాణ‌కు .. ఏపీకి స‌మానంగా పంపిణీ చేస్తున్నార‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ రాష్ట్రాలు ఏపీ క‌న్నా ఆర్థికంగా బ‌లంగా ఉన్నాయని, రెండు రాష్ట్రాల‌కు స‌మానంగా పంపిణీ చేయ‌డం వ‌ల్ల వెనుక‌బ‌డిన ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని నివేదించారు.

About Author