థర్ వేవ్‌పై .. జాగ్రత్తగా ఉండాలి
1 min readపల్లెవెలుగువెబ్, చాగలమర్రి: కరోనా మూడవ దశ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూడవ దశలో చిన్న పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని, ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞాన వైద్యులు హెచ్చరికలు జారీ చేసినట్లు ఐసిడిఎస్ చాగలమర్రి మండల సూపర్వైజర్ సుశీల తెలిపారు. మంగళవారం చాగలమర్రి చాగలమ్మ్గుగుడి ప్రాంగణం లో అంగన్వాడీ టీచర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరోన మహమ్మారి థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బాలింతలు, తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా కరోన టీకా క్యాంపులో అంగన్వాడి టీచర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించే నూటికి నూరు శాతం టీకా వేయించుకునేందుకు కృషిచేసి విజయవంతం చేసినందుకు అభినందించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషితో ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ శాతం టీకాలు వేయించుకునేందుకు కృషి చేశామన్నారు. సమావేశంలో అంగన్వాడి టీచర్లు చంద్రకళ, పద్మ, సుగుణ, హసీనా, నాగమణి, వహీదా, మై మూన్, వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.