PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్​పై.. భరోసా..

1 min read
మాట్లాడుతున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

మాట్లాడుతున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

అపోహాలు వద్దు.. ఎస్పీ డా.ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం: కోవిడ్​ వ్యాక్సిన్​… ఆరోగ్యానికి సురక్ష అని, దానిపై అపోహాలు వద్దని కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్​ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పోలీసుసిబ్బంది తో సమావేశం నిర్వహించారు. డాక్టర్తో పలు సలహాలు, సూచనలు ఇప్పించి దిశా , నిర్దేశం చేసి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోజుకు వంద కేసులు చొప్పున పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో అర్హులైన వారు కోవిడ్​ వ్యాక్సిన్​ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మధుసుధన రావు, ఎఆర్ అడిషనల్ఎస్పీ రాధాక్రిష్ణ, డిఎస్పీలు రాజీవ్ కుమార్, కెవి మహేష్, వై. రవీంద్రా రెడ్డి, సీనియర్ వైద్యులు, పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి , పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.

About Author