వైరస్‌పై.. భరోసా..
1 min read–వ్యాక్సిన్‌పై అపోహాలు వద్దు
– ఎస్పీ డా.ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: కోవిడ్ వ్యాక్సిన్… ఆరోగ్యానికి సురక్ష అని, దానిపై అపోహాలు వద్దని కర్నూలు జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని పోలీసుసిబ్బంది తో సమావేశం నిర్వహించారు. డాక్టర్‌తో పలు సలహాలు, సూచనలు ఇప్పించి దిశా , నిర్దేశం చేసి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోజుకు వంద కేసులు చొప్పున పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో అర్హులైన వారు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మధుసుధన రావు, ఎఆర్ అడిషనల్ఎస్పీ రాధాక్రిష్ణ, డిఎస్పీలు రాజీవ్ కుమార్, కెవి మహేష్, వై. రవీంద్రా రెడ్డి, సీనియర్ వైద్యులు, పోలీసు వేల్పేర్ డాక్టర్ స్రవంతి , పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.