PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ మరోసారి సీఎం గా జగనన్న ను ఆశీర్వాదించండి

1 min read

– వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీఎన్, ఎంపీపీ చీర్ల 

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి గా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించాలని వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీయన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు , సోమవారం వారు చెన్నూరు సచివాలయం 3 పరిధిలోని కొత్త గాంధీ నగర్ సమీపంలో వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే గతంలో మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శం అని మాట్లాడ్డం జరిగేదని అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్లమన్నారు, కానీ జగనన్న పాలన చూసిన తర్వాత వై.ఎస్. జగన్ పాలనకు ముందు, వై.ఎస్. జగన్ పాలనకి తరువాత అని మాట్లాడుకునే విధంగా మన జగనన్న పాలన ఉందన్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రోజున మన కుటుంబంలో ఒక ఇంటి పెద్దగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, పిల్లలకు ఒక మేనమామగా ఈ రోజున మన అందరి కుటుంబాలలో కూడా ఇమిడిపోయారని తెలిపారు., ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ప్రజల్ని అంతా ఆప్యాయంగా, అంత అక్కున చేసుకున్నది లేదన్నారు. ప్రజలందరి అవసరాలు కూడా తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారని తెలిపారు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డే నని వారు తెలిపారు, అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారు స్పష్టం చేశారు అందుకే ఈ విషయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందకు కావాలంటే..’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వాలంటీర్స్, గృహ సారథలు, నాయకులు, కార్యకర్తలు అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదించాలని వారు ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, వైఎస్ఆర్సిపి యువ నాయకులు పెడబల్లె ప్రదీప్ రెడ్డి, నిత్య పూజ య్య, చంద్ర, రమణ, వార్డు మెంబర్లు, టిఎన్ మహేశ్వర్ రెడ్డి, జగన్నాథం శీను, పుల్లయ్య ,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

About Author