మరోసారి ఏసీ ధరల పెరుగుదల..!
1 min readపల్లెవెలుగు వెబ్: ఎయిర్ కండిషనర్ తయారీదారులు మరోసారి ధరలు పెంచారు. ఈ సారి 8 నుంచి 13 శాతం ఏసీ ధరలు పెంచేశారు. మూడు నెలల వ్యవధిలో ఏసీ ధరలు పెరగడం ఇది రెండోసారి. ఇంతలా ధరలు పెంచడానికి కారణం స్టీల్, కాపర్ లాంటి ముడిసరకుల ధరల పెరగుదల కారణం అని ఏసీ ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణకు ఎన్ని నిర్ణయాలు తీసుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంలేదు. ఫ్రిజ్ ల ధరలకు 3 నుంచి 5 శాతం పెరుగుతోందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ముడి సరకుల ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని, ఫలితంగా వస్తువుల ధరలు పెంచాల్సి వస్తోందని చెబతున్నారు.
ఏసీ ధరల పెరుగుదల:
కంపెనీ పేరు పెరుగుదల శాతం
1.బ్లూస్టార్ 8 నుంచి 13 శాతం
- పానసోనిక్ 6 నుంచి 8 శాతం
- ఎల్జీ 6 నుంచి 8 శాతం
- గోద్రేజ్ 6 నుంచి 10 శాతం