టెట్ ఒక్కసారి పాసైతే.. జీవితాంతం వర్తింపు
1 min readపల్లెవెలుగు వెబ్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ఒక్కసారి పాసైతే.. జీవితాంతం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టెట్ పాసైన అభ్యర్థులకు ఏడేళ్లు మాత్రమే టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటయ్యేది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉపాధ్యాయ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది. గతంలో ఒక్కసారి టెట్ పాస్ అయ్యాక.. ఏడేళ్లలోపు ఉద్యోగం సాధించాలి. లేదంటే టెట్ సర్టిఫికేట్ చెల్లుబాటు అయ్యేది కాదు. తాజాగా కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విధానాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడ అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కేంద్రం సూచన మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ ను అమల్లోకి తీసుకొచ్చాయి.