PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకప్పుడు… నా శరీరంపైనే.. అసంతృప్తి..

1 min read

– గోవా బ్యూటీ ఇలియానా
నిత్య యువ్వనం.. అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అగ్ర కథానాయకురాలు గోవా బ్యూటీ ఇలియానా… ఒకప్పుడు అద్దంలో తన శరీరాని చూసి.. బాధపడేదట. తాను అందంగా లేనని, తన కొలతలు సరిగా లేవని అసంతృప్తితో ఉండేదట. అద్దంలో తన శరీరాన్ని చూసుకుని వేదనకు గురయ్యేదట. ఈ విషయాన్ని ఇలియానా తాజాగా వెల్లడించింది. ‘బాడీ డిస్‌మార్ఫియా’ అనే ఫోబియా గురించి మాట్లాడింది. కొందరు అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా… అద్దంలో చూసుకున్నపుడు ఏదో ఒక లోపం ఉన్నట్లు కనిపిస్తుంటుంది. నిజానికి, జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించినపుడు, మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందంగా కనిపిస్తాం. ఆ విషయం చాలా మందికి తెలియడం లేదు. ఒకప్పుడు నేనూ ఈ సమస్యతో బాధపడ్డాను. ఇప్పుడు పాజిటివ్​గా ఆలోచిస్తున్నాను.. నా శరీరం పట్ల గర్వంగా ఫీలవుతున్నాన’ని ఇలియానా చెప్పుకొచ్చింది.

About Author