ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడాదిన్నర చిన్నారి !
1 min readపల్లెవెలుగు వెబ్: మహారాష్ట్రలోని ఓ ఏడాదిన్నర చిన్నారి ఒమిక్రాన్ నుంచి కోలుకుంది. చిన్నారికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జీ చేసినట్టు పూణే జిల్లా పింప్రీ-చించ్వాడ్ ప్రాంత ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల ముందు నైజీరియా నుంచి భారత్ కు వచ్చిన ఓ మహిళ పింప్రీ చించ్వాడ్ లోని తన సోదరుడిని కలిసింది. ఆ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతని ఇద్దరు కుమార్తెలు (వీరిలో ఏడాదిన్నర పాప)కు ఒమిక్రాన్ సోకింది. వీరిలో ఏడాదిన్నర పాపతో సహా నలుగురికి నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.