PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే రోజు ఒకే వ్యక్తికి.. కిడ్నీ, లివర్ మార్పిడి

1 min read

• కిమ్స్ ఐకాన్ లో విజయవంతంగా శస్త్రచికిత్సలు

హాజరైన ఏపీ జీవన్ ధాన్ కో ఆర్డినేటర్ డా. రాంబాబు

విశాఖపట్నం: సాధారణంగా ఒక వ్యక్తికి అవయవాల మార్పిడి చేయాలంటే రోజుల సమయం పడుతుంది. కానీ విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు మాత్రం ఒకే రోజు కిడ్నీ, లివర్ మార్పిడి చేసి రోగికి ఊరట కల్పించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను కిమ్స్ ఐకాన్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. చలపతిరావు ఆచంట మరియు నెఫ్రాలజిస్ట్ డా. ఆర్. కె. మహేష్ లు వివరించారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన 50 యేళ్ల కనక అప్పారావు, వృత్తి రీత్యా ఫోటోగ్రాఫర్. రక్తసంబంధమైన కారణాల వల్ల హెపటైటిస్-సి వైరస్ తీవ్రస్థాయిలో ఉండడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. అలాగే మధుమేహం కూడా ఉన్న కారణంతో మూత్రపిండాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో అవయవాల మార్పిడి జరకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. ఈ పరిస్థితిలో 70 ఏళ్ల మహిళా దాత నుంచి సేకరించిన ఒక కిడ్నీ, లివర్ ను ఒకే రోజు అమర్చడం జరిగింది. ఈ శస్రచికిత్సలకు సకాలంలో అవయవదాత దొరకడం, సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం వల్ల రోగి ప్రాణాలు కాపాడగలిగాం.

అరుదైన శస్ర్తచికిత్స..:

ఈ అరుదైన శస్త్రచికిత్స నవంబర్ 2న విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చేశాం. ఈ శస్త్రచికిత్సలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. రవిచంద్ సిద్దాచారి, డా. సచిన్ డాగా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డా. ఉమామహేశ్వర రావు, డా. మురళీ కృష్ణ,  గాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఎ. చలపతి రావు, నెఫ్రాలజిస్ట్ లు డా. ఆర్.కే మహేష్‌ లు పాల్గొన్నారు. రోగికి అపరేషన్ జరిగిన తరువాత 10 రోజులలో కోలుకొని ఇంటికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం కాలేయం, మూత్రపిండం సాధారణ స్థితికి చేరుకుంది. 

కిమ్స్​ ఐకాన్​కు…కృతజ్ఞతలు.. :  రోగుల బంధువులు

అనంతరం కిమ్స్ ఐకాన్ ఎండి. డాక్టర్ సతీష్ కుమార్ పెతకంసెట్టి మాట్లాడుతూ అత్యాధునిక అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు కిమ్స్ ఐకాన్ లో అందుబాటులో ఉన్నాయి. తద్వారా 10 మందికి కాలేయ మార్పిడి మరియు దాదాపుగా 100కి మూత్రపిండాల మార్పిడి దిగ్విజయంగా పూర్తి చేసి ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడగలిగామని వివరించారు. ఏపీ జీవన్ ధాన్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసినందుకు కిమ్స్ ఐకాన్ యాజమాన్యాన్ని మరియు వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో రోగి,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రాణాలతో దక్కడనకున్న తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన కిమ్స్ ఐకాన్ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

About Author