NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌లార్ మూవీకు వంద కోట్ల ఆఫ‌ర్

1 min read

ప్రభాస్ హీరోగా.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం స‌లార్. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్దమ‌వుతోంది. అయితే.. విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నప్పటికీ ఈ సినిమా బిజినెస్ మాత్రం ఇండ‌స్ట్రీని కుదిపేస్తోంది. కేవ‌లం డిజిట‌ల్ విభాగంలోని ఓటీటీ రైట్స్ కోసం 100 కోట్ల రూపాయ‌లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఆఫ‌ర్ చేసింద‌ని ఇండ‌స్ట్రీ టాక్. ప్రభాస్ పాన్ ఇండియాతో పాటు… అంత‌ర్జాతీయంగా కూడ గుర్తింపు తెచ్చుకోవ‌డంతో.. అమెజాన్ ఈ ఆఫ‌ర్ ను ఇచ్చింద‌ని ఇండ‌స్ట్రీ టాక్. ఓటీటీ రైట్స్ మాత్రమే వంద కోట్ల బిజినెస్ చేస్తే… ఇక థియేట‌ర్ బిజినెస్ ఎంత వ‌స్తుందోనన్న ఆశ్చర్యం ఇండస్ట్రీ వ‌ర్గాల్లో వ్యక్తమ‌వుతోంది.

About Author