రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి గాయాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ మహానంది: సోమవారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి గాయపడినట్లు స్థానికులు తెలిపారు. నంద్యాల మహానంది రహదారిలో బొల్లవరం సుగాలిమిట్ట మద్దెన ఈ సంఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన జగడం సురేష్ తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్క ముని అనే ఇద్దరు మోటార్ సైకిల్ పై నంద్యాల వైపు పోవుచుండగా నంద్యాల వైపు నుండి వస్తున్న ఒక వాహనం ఢీకొట్టడంతో జగడం సురేష్ మృతి చెందాడని గాయపడ్డ ముని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.