NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎకరాకు లక్ష పరిహారం చెల్లించాలి: పటలను పరిశీలించిన ప్రభాకర్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మిడుతూరు మండలంలోని జలకనూరు,తలముడిపి, చింతలపల్లి,కాజీపేట, దేవనూరు గ్రామాల్లో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్ ఈనెల 16న కురిసిన వడగండ్ల వర్షానికి మిర్చి మొక్కజొన్న అరటి బొప్పాయి తదితర పంటలు పూర్తిగా రాలిపోయి నేలమట్టం అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పంటలకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో వడగండ్ల వర్షంతో బీభత్సం చేసి రైతుల పంటలు నష్టపోవడం జరిగిందని అన్నారు.పంట మొత్తం నేల రాలిపోయి 30% చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు.అందువలన ప్రభుత్వం తక్షణమే మిరప పంటకు ఎకరాకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇవ్వాలని పంటల బీమా వర్తింపజేయాలని మొక్కజొన్న పంటకు ఎకరాకు 60 వేల రూపాయలు నష్టపరం ఇవ్వాలని అరటి పంటకు ఎకరాకు మూడు లక్షల వరకు పెట్టుబడి ఖర్చు వస్తుందని ప్రభుత్వం ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వీటితోపాటు బొప్పాయి తదితర పంటలకు ఇచ్చే నష్టపరిడాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.పంటలు నష్టపోయి వారం రోజులు కావస్తున్న జిల్లా కలెక్టర్,జిల్లా ఆర్టికల్చర్ అధికారులు పరిశీలించి నష్టపరిహారం అంచనా వేయకపోవడం బాధాకరమన్నారు.తక్షణమే జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని రైతుల నష్ట పరిహారం అంచనా వేసి ప్రతి ఒక్క రైతుకు కౌలు రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూడాలని అన్నారు.ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు,రైతు సంఘం జిల్లా నాయకుడు వి రామకృష్ణ,మద్దిలేటి, రమణయ్య,శ్రీనివాసులు,శేఖర్, కురువ రామకృష్ణ, వెంకటరమణ,మౌలాలి పాల్గొన్నారు.

About Author