PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నలభై ఇండ్లలో ఒక్క ఇల్లు బేస్మెంట్

1 min read

– ఇలాగైతే ప్రభుత్వ ఆశయం కలగానే ఉంటుందా..?
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలం చౌట్కూరు గ్రామ పంచాయితీ మజారా గ్రామమైన గడిపాడులో జగనన్న కాలనీని హౌసింగ్ లేఔట్ ను బుధవారం గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్ తో కలసి ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ సిరాజుద్దీన్,ఇంచార్జి ఏఈ హౌసింగ్ రమేష్ ఇండ్లను సందర్శించారు.ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలో 40 మందికి పట్టాలు ఇస్తే కేవలం ఒక్కరు మాత్రమే ఇల్లు మొదలు పెట్టి బేస్మెంట్ వరకు కట్టుకున్నారు కానీ మిగతా వారు ఎందుకు ముందుకు రావడం లేదని ఎంపీడీవో అన్నారు.కొత్త వారిని నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం లేఔట్ కోసం చాలా డబ్బు వెచ్చించిందని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ లబ్దిదారులకి కోరారు.మరొక లబ్ధిదారులు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి రిజర్వాయర్ కోసం ప్రతిపాదించిన మ్యాప్ లో మా గ్రామంలో కూడా ఉందని ఊరే మునిగిపోతుంది అంటున్నారు అని ఊరే లేనప్పుడు ఇక ఇల్లు కట్టుకుని ఏం చేయాలి అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.తహసిల్దార్ మాట్లాడుతూ అటువంటి ప్రతిపాదన ఏది కూడా మా దృష్టికి రాలేదని,అపోహలను నమ్మొదద్దని లబ్దిదారులకి సూచించారు.జిల్లా కలెక్టర్ గారి నుండి పూర్తి స్పష్టత తీసుకుని మీకు వివరిస్తామని అన్నారు.ఇంచార్జి ఏఈ హౌసింగ్ జె.రమేష్ మాట్లాడుతూ ఇంటి మంజూరు వచ్చిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలని ఇంటి నిర్మాణం సామాగ్రి అంతా కూడా ప్రభుత్వం చాలా తక్కువ ధరకే ఇస్తుందని 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తుందని అన్నారు.లబ్ధిదారులు ముందుకు వచ్చి వీలైనంత త్వరగా ఇల్లు మొదలు పెట్టి పూర్తి చేయాలని సూచించారు.గుడిపాడులో 40 ఇండ్లకు గాను ఒక్కరు మాత్రమే బేస్మెంట్ వరకు కట్టించి మిగతా 39 మంది ముందుకు రాకపోవడం ఇలాగైతే ప్రభుత్వ ఆశయం కలగానే మిగులుతుందా లబ్ధిదారులను ఎందుకు మెప్పించలేకపోతున్నారు..?ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి ఎం.రవీంద్రబాబు,విఆర్వో రామయ్య,ఇంజనీరింగ్ అసిస్టెంట్ చరణ్,వర్క్ ఇన్స్పెక్టర్ భాష మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

About Author