పుస్తకంలో ఒక పేజీ.. 24 కోట్లుకు అమ్ముడుబోయింది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఒక పుస్తకంలో ఒక పేజీ.. ధర రూ. 24 కోట్లు పలికింది. 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీ వేలంలో రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది. స్పైడర్ మ్యాన్ 1962 నాటి ప్రచురణతో కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఇది అందరీ ఇంటి పేరుగా మారిపోయింది. 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీ వేలంలో ఇంత ధర పలకడంతో ఆ పాత్రకు ఉన్న ప్రజాదరణ మరోసారి తేటతెల్లం అయ్యింది.