ఒక్క వాట్సాప్ మెసేజ్.. 40 లక్షలు పోయాయి !
1 min readపల్లె వెలుగు వెబ్ : హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి కి చెందిన ఒక వ్యక్తికి ఒక అజ్ఞాత నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తే లాభాలే.. లాభాలంటూ వివరించారు. ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి ఉందని బాధితుడు చెప్పడంతో.. వెబ్ సైట్ లింక్ పంపించారు. మొదట 50 వేలు ఇన్వెస్ట్ చేశాడు. 12 వేలు లాభం వచ్చింది. మరో బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి 5 లక్షలు ఇన్వెస్ట్ చేయమన్నారు. ఎందుకుని అడిగితే.. బ్యాకప్ కేసమని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరో 50 వేలు లాభం వచ్చింది. బాధితుడు ఆ డబ్బును విత్ డ్రా చేసుకున్నాడు. నమ్మకం పెరిగింది. తెలిసవాళ్లతో, పర్సనల్ లోన్ తీసుకుని 40 లక్షలు `లార్డ్ బుద్ధ సర్వీసెస్` అనే పేరుతో ఉన్న అకౌంట్ లో డిపాజిట్ చేశాడు. అతను ఇన్వెస్ట్ చేసిన 40 లక్షలు.. వచ్చిన లాభం కలిపి వెబ్ సైట్ లో 2 కోట్లు చూపింది. తీరా విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. సాంకేతిక కారణాలంటూ సాకులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ వెబ్ సైటే కనిపించకుండా పోయింది. వారి ఫోన్ నెంబర్లు కూడ పని చేయలేదు. దీంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.