బీహార్లో కొనసాగుతున్న అగ్నిపథ్ ఆందోళనలు !
1 min readపల్లెవెలుగువెబ్ : బీహార్ లో ‘అగ్నిపథ్’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో శనివారం రాత్రి 8 గంటల వరకు రైలు సర్వీసులు నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు మరో ప్రకటన చేస్తూ రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాలుస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.