కొనసాగుతోన్న భారత్ బంద్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా కార్మికులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల భారత్ బంద్ చేపట్టారు. భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు మేర బంద్ కు మిశ్రమ స్పందన లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచన, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమ్మెకు మద్దతు ఇచ్చింది.దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ అయ్యాయి. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపు పన్నుశాఖ, బీమా సంస్థల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. భారత్ బంద్ వల్ల బ్యాంకింగ్ సేవలపైనా సమ్మె ప్రభావం పడింది.