కొనసాగుతున్న గురు రాఘవేంద్ర వైభవోత్సవాలు…
1 min read
రాఘవునికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పణ
అలకరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర వైభవోత్సవాలు బుధవారం ఆరవ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి కి సాంప్రదాయ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఇఓ లోకనాదన్ రాఘవేంద్ర స్వామి కి పట్టువస్త్రాలు తీసుకుని వచ్చారు. వీరి కి శ్రీమఠం ఏఏఓ మాదవ శెట్టి, మేనేజర్ వెంకటేష్ జ్యోషి, ఎస్ కే శ్రీనివాస్ రావు, జోనల్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి, మఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను శారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని టిటిడి వారు కి స్వాగతం పలికారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఊంజల మంటపంలో పట్టువస్త్రాలను పూజలు చేశారు. టిటిడి డిప్యూటీ ఈఓ లోకనాదన్ పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులను శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే టిటిడి డిప్యూటీ ఈఓ కు మఠం సాంప్రదాయ ప్రకారం శేషవస్త్రం కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు, టిటిడి అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

