ఆన్ లైన్ లో.. ఔషధాల విక్రయం నిషేధించండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఔషధాలను విక్రయించకుండా నిషేధం విధించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్’ పేరుతో ఆన్‌లైన్ ఔషధ విక్రయాల్లోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే సీఏఐటీ ఈ డిమాండ్ చేయడం గమనార్హం. ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించే ఈ ఫార్మసీలను నిషేధించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయ ల్, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశామని.. తక్షణమై దీనిపై దృష్టి సారించాలని కోరినట్టు ప్రకటించింది.