ఆన్ లైన్ రిక్రూట్మెంట్..లక్షల్లో మోసం
1 min readహైదరాబాద్: ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు తాజాగా గండిపేట ప్రాంతానికి చెందిన ఇద్దరి యువకుల వద్ద నుంచి భారీగా సొమ్ము కాజేశారు. ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ ప్రకటన ద్వార ఈ డబ్బును కాజేశారు. ఆన్ లైన్ రిక్రూట్ మెంట్ .. నెలకు 2 వేల వరకు సంపాదించవచ్చు అంటూ వచ్చిన ప్రకటన చూసిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల మాయలో పడ్డాడు. అతనితో పాటు మరొక వ్యక్తిని కూడ ఆ స్కీమ్ లో చేర్పించాడు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ద్వార బ్యాంక్ డెబిట్ కార్డు వివరాలు అందించాడు. దాదాపు 18 వేల వరకు రీచార్జ్ ల పేరుతో డబ్బున కాజేశారు. వీరిద్దరి వద్ద నుంచి సేకరించిన బ్యాంక్ వివరాలతో .. వారి అకౌంట్లలోని 6 లక్షల 70 వేల రూపాయలు కాజేశారు. అనంతరం వీరిని సైబర్ నేరగాళ్లు సంబంధిత గ్రూపు నుంచి తొలగించారు. దీంతో బాధితులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.