PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆన్ లైన్ ర‌మ్మీ నిషేధించాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడులో ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్ నిషేధించేందుకు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. దీని కోసం అత్యవసర చట్టాన్ని రూపొందించే నిమిత్తం మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసలైన యువతీ యువకులు, గృహిణులు, విద్యార్థులు లక్షలాది రూపాయలను నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధించేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఆ మేరకు ఆన్‌లైన్‌ జూదాలన్నింటినీ నిషేధించే విషయమై చేపట్టాల్సిన చర్యలపై సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో, ఇతర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురువారం సమావేశమై సమగ్రంగా చర్చలు జరిపారు.

                                     

About Author