NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

11 శాతం మంది విద్యార్థుల‌కు మాత్ర‌మే లెక్క‌ల్లో ప‌ట్టు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ‌లోని 11శాతం మంది విద్యార్థులు చిన్నచిన్న కూడికలు, తీసివేతలు కూడా చేయలేకపోతున్నారు. ఇక తప్పుల్లేకుండా తెలుగు చదవగలిగే విద్యార్థులు 9 శాతమే. మ్యాథ్స్‌ భావనల విషయంలో విద్యార్థులకు కనీస అవగాహన లేదు. ఈ విషయంలో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ (9శాతం), కర్ణాటక(8), కేరళ(7) రాష్ట్రాలు తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి. అయితే తమిళనాడు (29), గుజరాత్‌(18), ఛత్తీస్‌గఢ్‌(14), మధ్యప్రదేశ్‌(13) వంటి రాష్ట్రాల కంటే తెలంగాణ విద్యార్థులు మెరుగ్గా ఉన్నారు. అలాగే న్యూమరసీలో పరిమిత అవగాహన ఉన్నవారు రాష్ట్రంలో 38శాతం మంది ఉన్నారు. వీరికంటే కొంత మెరుగ్గా సామర్థ్యాలు ఉన్నవారు 40శాతం మంది ఉన్నారు. మిగతా 11శాతం మందికి మాత్రం అద్భుతమైన గణిత సామర్థ్యాలు ఉన్నాయి. వీళ్లు సంక్లిష్టమైన మ్యాథ్స్‌ ప్రాబ్లమ్స్‌కు సమాధానాలు కనుక్కోగలుగుతున్నారు. ఈ క్యాటగిరీ విద్యార్థుల శాతం విషయంలో ఏపీ(9), కేరళ(9), గుజరాత్‌(7), ఢిల్లీ(7), పంజాబ్‌(8) కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉండగా… కర్ణాటక(14), ఒడిశా(14), బిహార్‌(18), యూపీ(13) వంటి రాష్ట్రాల కంటే వెనుకంజలో ఉంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ), కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

                                                   

About Author