NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పులివెందుల్లో జ‌గ‌న్ కు 51 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: పులివెందుల‌లో జ‌గ‌న్‌కు 51 శాతం మాత్ర‌మే మ‌ద్ద‌తు ఉంద‌ని ఏపీ బీజేపీ నేత స‌త్య‌కుమార్ చెప్పారు. ఈ గ‌ణాంకాలు తాము చెబుతున్న‌ది కాద‌న్న స‌త్య‌కుమార్‌… స‌ర్వేలోనే ఈ విష‌యం తేలింద‌న్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే సీఎం జ‌గ‌న్‌ బొటాబొటీ మెజారిటీ పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 175 సీట్ల‌లో గెల‌వాల‌ని పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఎమ్మెల్యేల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్ల‌మ‌ని చెబుతున్న జ‌గ‌న్‌… తాను మాత్రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎందుకు తిర‌గ‌డం లేద‌ని స‌త్య‌కుమార్ ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేల మాదిరే జ‌గ‌న్ కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

                                          

About Author